The Warrior Movie: ‘ది వారియర్’ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర.. ప్రముఖ సంస్థ దూకుడు
యువ కథానాయకుడు రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్'(The Warrior). ఇందులో కృతీ శెట్టి(Krithi Shetty), అక్షర గౌడ(Akshara Gouda) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో
ఆది పినిశెట్టి(Adi Pinishetty) విలన్ గా చేస్తున్నాడు. దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాను కర్నూలు బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తుండగా.. ఇందులో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు.
పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ది వారియర్’ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను అప్పుడే విక్రయించేశారని సమాచారం. రూ.35 కోట్లకు ఈ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్(Disney+ Hotstar) సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. కాగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్(Srinivasa Silver Screen) బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Recent Comment