Bheemla Nayak Box Office Day 6: అక్కడ “భీమ్లా నాయక్” కలెక్షన్ల సునామీ.. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ రికార్డ్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(PAWAN KALYAN), రానా దగ్గబాటి(RANA DAGGUBATI) హీరోలుగా సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’(BHEEMLA NAYAK). సాగర్​ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తివిక్రమ్​ శ్రీనివాస్(TRIVIKRAM SRINIVAS)​ డైలాగ్స్​, స్క్రీన్​ప్లే అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ‘భీమ్లా నాయక్’ మూవీ థియేటర్లలో దుమ్మురేపుతోంది. పవన్ కళ్యాణ్ స్టామినాకు నిదర్శనంగా భారీ రేంజ్ కలెక్షన్స్ వసూలుచేస్తోంది.

ముఖ్యంగా యూఎస్‌(US)లో భీమ్లా నాయక్ జోరు కొనసాగుతోంది. అక్కడ 250కి పైగా థియేటర్లలో రోజుకు 750 షోలు నడుస్తున్నాయి. యూఎస్‌లో భీమ్లా నాయక్ చిత్రం ఇప్పటివరకు 2.25 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దీంతో అంతకుముందు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పేరిట నమోదైన రికార్డ్ ఇప్పుడు బద్దలైంది. అలాగే యూఎస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో భీమ్లా నాయక్ చిత్రం 15వ స్థానంలో నిలిచింది. మొత్తంగా యూఎస్‌లో భీమ్లా నాయక్ మూవీ 2.25 మిలియన్ డాలర్స్ అంటే 17.13 కోట్లు వసూలుచేసింది.