Radhe Shyam’s climax is bigger than Titanic: ’టైటానిక్’ క్లైమాక్స్ ని మించిపోయేలా ప్రభాస్ “రాధే శ్యామ్”
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’(Radhe Shyam) . పూజ హెగ్డే కథానాయిక. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో ప్రభాస్(Prabhas) విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే(Pooja hegde) ప్రేరణగా నటిస్తోంది. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు(Krishnam raju) ఈ సినిమాను సమర్పిస్తుండగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.
అయితే ఈ సినిమాలో ఓ షిప్ సీక్వెన్స్ వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ “టైటానిక్” సినిమాని గుర్తు చేస్తుందన్న టాక్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ చిత్రబృందం మాత్రం టైటానిక్ కి ‘రాధేశ్యామ్’కి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కానీ తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ రేసుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘రాధేశ్యామ్’(Radhe Shyam) సినిమా క్లైమాక్స్ టైటానిక్ ని తలదన్నేలా ఉంటుందని ఈ సినిమాకి పనిచేసిన వ్యక్తి చెప్పడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కాగా, ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులకు పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ ఇందులో నటించారు.
Recent Comment