Ravi Teja Remuneration: రెమ్యునరేషన్ భారీగా తగ్గించిన రవితేజ!

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’(RAMA RAO ON DUTY). రవితేజ కెరీర్ లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శరత్ మండవ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ(RAVITEJA) ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు చక్కటి స్పందన లభించింది. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్​ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమాకు రవితేజ తక్కువ రెమ్యునరేషన్​ తీసుకున్నాడని సమాచారం. ఇందుకోసం రవితేజ రోజుకు కేవలం రూ. 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజకు మొత్తంగా రూ. 10 నుంచి 12 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రవితేజ ఒక సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. దాంతో పోల్చుకుంటే ఈ సినిమాకు గాను తక్కువ మొత్తం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, నాజర్‌, సీనియర్‌ నటుడు నరేశ్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా రాహుల్‌ రామకృష్ణ సర్పట్టా ఫేం జాన్‌ విజయ్‌, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు.