KGF Chapter 2: “కేజీయఫ్ 2” ట్రైలర్ డేట్ ఫిక్స్.. రాకీ భాయ్ ఫ్యాన్స్ గెట్ రెడీ

కన్నడ రాకింగ్ స్టార్ యష్‌(Yash) కథానాయకుడుగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్(KGF) తొలి భాగం ఎంతటి భారీ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కళ్లుచెదిరే రీతిలోకలెక్షన్లను రాబట్టింది. దాంతో యష్‌ ఒక్కసారిగా సూపర్ స్టార్‌ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌ గా “కేజీయఫ్ 2” ( KGF Chapter 2) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ మూవీని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌ నిర్మిస్తోంది. ఇక సీక్వెల్‌లో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్‌ దత్‌(Sanjay dutt) విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో “కేజీయఫ్ 2” ట్రైలర్‌(KGF Chapter 2 Trailer) ఈవెంట్‌గా చిత్రంనిర్మాతలు గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.