జూనియర్ ఎన్టీఆర్( NTR) దర్శకుడు రాజమౌళి(Rajamouli ) కాంబినేషన్ లో నటించిన పాన్ ఇండియన్ మూవీ RRR. ఈ సినిమా మార్చి25 భారీ హంగామాతో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత NTR తన తదుపరి 30వ సినిమా కొరటాల శివ (Kortala Siva )దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఈ ఐటమ్ సాంగ్ కొరకు సమంతని(Samantha ) తీసుకోవాలని చూస్తున్నారట. పుష్ప (Pushpa )సినిమాలో ఊ అంటావ మామ అంటూ స్టెప్పులు వేస్తు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది సమంత .

NTR 30వ సినిమాలో కూడ ఐటమ్ సాంగ్ చేయాలని ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయట. ఈ సినిమా లో NTR కి జోడిగా బాలీవుడ్ నుండి హీరోయిన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక డాక్టర్ రాజశేఖర్(Rajashekar ) ఒక ముఖ్యపాత్ర పోషించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రికరణ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు మేకర్స్.