మాస్ మహారాజ రవితేజ(Ravi teja ) నటించిన ఖిలాడి (Khiladi )సినిమా ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తునే ఉంది. బాక్స్ ఆఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ( Ramarao on duty ),ధమాకా(Dhamaka ),రవణాసుర(Ravanasura ),టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు .ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుండి టీజర్ రీలిజ్ చేసేందుకు మేకర్స్ రెడి అయ్యారు.ఏప్రిల్ 15వ తేదిన ఈ సినిమా విడుదలకి ప్లాన్ చేశారు.ఈనేపథ్యంలో ప్రమోషన్ పెంచే పనిలో ఉన్నారు.

రవితేజ (Ravi Teja )సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఒకరు దివ్యాన్ష కౌశిక్, మరొకరు రజిష విజయన్. ఇక ముఖ్యపాత్రలలో నాజర్, పవిత్ర లోకేష్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హిరో రవితేజ పవర్ ఫుల్ MRO పాత్రపోషిస్తున్నారు. ఎన్నొ అంచనాలతో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన రాబడుతుందో చూడాలి.