జూనియర్ ఎన్టీఆర్ (NTR ), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan ) హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli )ప్రతిష్టాత్మకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన చిత్రం రౌద్రం రణం రుధిరం(RRR ). ఈ సినిమా దాదాపు చాలా చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు కంప్లీట్ చేసారు. మరి కొన్ని చోట్ల ఇప్పుడు చేసెందుకు RRR టీమ్ సిద్దం అవుతుంది. మార్చి నెల నుండి మరోసారి ప్రమోషన్ షురూ చేయనున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మార్చ్ మొదటి వారంలో అతి భారీ సెట్ వేసి ఫ్రీ1 రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు.

అలాగే టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.ఇక చివరి ఈవెంట్ దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.కరోనా కారణంగా వాయిదా పడిన RRR సినిమా ఎట్టకేలకు మార్చి నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.ఈ మూవీలో ఎన్టీఆర్ (NTR )కొమరం భీమ్ గా ,చరణ్(Charan ) అల్లూరి సీతారామరాజుగా నటించారు.