Nagababu financial assistance to hair dresser Naga Srinu : నాగశ్రీనుకు మెగా బ్రదర్ భారీ సాయం.. ‘మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదీ!
మంచు ఫ్యామిలీ ,హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను (Naga Srinu) మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. తొలుత మంచు విష్ణు కార్యాలయంలో రూ. ఐదు లక్షల విలువైన సొత్తును నాగశ్రీను ఎత్తుకెళ్లాడంటూ జూబ్లీహిల్స్ ఠాణాలో ఆయన లీగల్ మేజనర్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ(Manchu Family) తనను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టడం వల్లే ఉద్యోగం మానేశానని హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను పేర్కొన్నాడు. దొంగతనం పేరుతో అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అక్రమ కేసు కారణంగా తన తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతిందని నాగశ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) నాగశ్రీనుకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నాగశ్రీను తల్లి ఆరోగ్యం క్షీణించిందన్న విషయం తెలిసి నాగబాబు ఆర్థిక సాయం చేశారని తెలుస్తోంది. అలాగే అపోలో హాస్పిటల్ లో నాగశ్రీను కుటుంబానికి ఉచితంగా వైద్యం అందేలా నాగబాబు హామీ ఇచ్చారని సమాచారం. ఇక నాగబాబు చేసిన సహాయం గురించి మంచు ఫ్యామిలీ తరపు పీఆర్ స్పందించారు. తమ కార్యాలయం నుంచి ప్రతి నెలా నాగశ్రీనుకు సరిగ్గానే జీతాన్ని అందిస్తున్నామని పీఆర్ చెప్పుకొచ్చారు.
Recent Comment