Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ నుంచి ఫ్యాన్స్‌కి మరో భారీ సర్ప్రైజ్.. గెట్ రెడీ అంటున్న తమన్.!

పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన చిత్రం “భీమ్లా నాయక్‌”( Bheemla Nayak). ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే “భీమ్లా నాయక్‌” సినిమా మార్చి 25న ఓటీటీ విడుద‌ల‌కు కూడా సిద్ద‌మ‌వుతోంది. ఇందుకోసం ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+ Hotstar) సంస్థ ‘భీమ్లానాయక్’ చిత్రం డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

అయితే తాజాగా ‘భీమ్లా నాయక్’ నుంచి మ‌రో క్రేజీ అప్ డేట్‌ను ఇవ్వ‌డానికి సంగీత దర్శకుడు త‌మ‌న్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రం నుంచి ర్యాప్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు త‌మ‌న్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ర్యాప్ సాంగ్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు అనుకుంటున్నారు.