పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న భీంలా నాయక్ (Bheemla Nayak ) ట్రైలర్ వచ్చేసింది .ఈ ట్రైలర్ లో పవన్ ,రానాలా(Rana) యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి .ఇప్పుడు ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. ఇక భీంలా నాయక్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు రానా. డేనియల్ శేఖర్ పాత్రలో పవన్ కళ్యాణ్ తో సమానంగా పోటీ పడి మరీ నటించాడు. ఈ ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది.
కానీ ఇప్పుడు ట్రైలర్ మీద ఆర్జీవీ(RGV ) చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆర్.జి.వి ఈ మూవీకి భీంలా నాయక్ (Bheemla Nayak )కంటే డేనియల్ శేఖర్ అని పేరు పెడితే బాగుండేది అని ట్విట్టర్లో తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.పవన్ ని (Pawan Kalyan )తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయనకు మెసేజ్ లు పెడుతున్నారు.
ఎప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా ట్వీట్ చేసి వైరల్ అయ్యే వర్మ (Ram gopal varma )మళ్ళీ భీంలా నాయక్ విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ,ఆర్జివి (Rgv )మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వార్ చివరకు ఎలా ముగుస్తుంది అన్నది చూడాలి
Recent Comment