RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ( Ram Charan ) ,శంకర్ (Shankar ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .Ram Charan కెరీర్ లో ఇది 15వ సినిమాగా వస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. RC15 నుండి ఒక న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. రామ్ చరణ్ ( Ram Charan ) కి విలన్ గా స్టార్ నటుడు ఎస్ జె సూర్య ( SJ Surya ) నటించబోతున్నట్లు సమాచారం.తమిళ్ లో సూర్య విలన్ గా అదరగొడుతున్నాడు .మహేష్ బాబు ( Mahesh Babu ) నటించిన స్పైడర్ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు.అలాగే తమిళ్ లో అదిరింది, మనాడు మూవీస్ లో విలన్ అదరగొట్టాడు. ఇపుడు RC 15 లో రామ్ చరణ్ కి విలన్ చేస్తున్నాడని సమాచారం. శంకర్ ( Shankar ) రామ్ చరణ్ కి విలన్ గా ఎస్ జె సూర్యని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక RC15 లో చరణ్ కి జోడిగా కియార అద్వానీ ( Kiara Advani ) నటిస్తోంది. ఇక ఈ మూవీలో సునీల్ ( Sunil ) ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ( S thaman ) సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.