ఛలో(Chalo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యూత్ మనసులు దోచుకున్న క్రష్ బ్యూటి రష్మిక మందన(Rashmika ).ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun ) పుష్ప (Pushpa )సినిమాలో శ్రీవళ్లి పాత్రలో ప్రతి ఒక్కరిని బాగా మెప్పించి పాన్ ఇండియా(India ) హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో తనకుంటు పెద్ద గుర్తింపు సాదించింది రష్మిక. ఇక శర్వానంద్ (Sharwanand )హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Joharlu ) సినిమాతో మార్చి నెలలో రానుంది.ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది.

మరో వైపు రామ్ చరన్(Ram Charan ) తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది రష్మిక మందన.ప్రస్తుతం ఆమె ఫుల్ ఫామ్ లో ఉంది.సరిలేరు నికెవ్వరు, పుష్ప(Pushpa ) లాంటి వరుస హిట్స్ తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఆమెకు తెలుగుతో పాటు తమిళ్,కన్నడలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.యంగ్ హీరోస్ ఆమెతో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు.