పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ,రానా దగ్గుబాటి(Rana ) పోటాపోటిగా నటించిన సినిమా భీమ్లానాయక్ (Bheemla Nayak ).నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు. రేపు సినిమా విడుదల నేపథ్యంలో బాబాయికి సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు అబ్బాయి రాం చరణ్(Ram charan ). భీంలా నాయక్ (Bheemla Nayak )అలాగే గాడ్ ఫాదర్ (God Father )మూవీల మేకింగ్ వీడియో విడుదల చేశాడు.

గాడ్ ఫాదర్(God Father ) సినిమా షూటింగ్ లో ఖైదీ డ్రెస్ లో మెగాస్టార్ చిరంజీవి ,పవన్ నటించిన భీంలా నాయక్ షూటింగ్ కి వెళ్ళాడు. అలాగే చిరు షూట్ లో ఉన్నపుడు పవన్ అక్కడికి వెళ్లి సందడి చేశారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఇక భీమ్లానాయక్ సినిమాలోని డైలాగ్స్ ఎంతగానో బాగున్నాయని,యాక్షన్ ఫైట్ సీన్స్ బాగున్నాయని తెలిపాడు చరణ్.