Kalaavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. అరుదైన ఘనత సాధించిన మహేష్!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), మహానటి కీర్తి సురేశ్‌(Keerthi Suresh) జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట(Sarkaru Vari Pata). యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో
వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఇటీవల ఈ సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ కళావతి సాంగ్‌(Kalaa athi Song)ను చిత్రబృందం విడుదల చేసింది.
ఇప్పటివరకు కళావతి సాంగ్
60మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించి ఆదరగిట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఏ సినిమా సాంగ్స్ కి రాని స్పందన
“కళావతి” కి రావడం విశేషం. థమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

కాగా, ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.