Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైమ్ లాక్‌..!

ప్రభాస్‌(Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలను చేపడుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వివరాల‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. సినిమా ర‌న్ టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేశారు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ మూవీకి ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది.