టీమ్ ఇండియా, వెస్టిండీస్ ( IND vs WI) జట్ల మధ్య ఈ నెల 16 నుండి T20 సిరీస్ జరగనుంది.ఈ సమయంలో భారత్ కి షాక్ తగిలింది. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington sunder ) T20 సిరీస్ కి దూరం అయ్యాడు.స్నాయువు గాయంతో బాధపడుతున్న సుందర్ సోమవారం ప్రాక్టీస్ చేయలేదు.ఇప్పటికే జట్టు నుండి బయట వచ్చిన వాషింగ్టన్ సుందర్ ( Washington sunder ) నేషనల్ క్రికెట్ అకాడమికి(NCA) చేరాడు.అతన్ని పరీక్షించిన డాక్టర్స్ కొన్ని రోజుల రెస్ట్ కావాలని చెప్పడంతో పాటు, వరుసగా 5 రోజుల్లో 3 మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో అతన్ని సిరీస్ నుండి తప్పించారు.ఇక గత ఏడాదీ కూడా గాయంతో ఐపీల్,T20 ప్రపంచకప్ కి దూరం అయ్యాడు.ఇక ఈ నెల 16 నుండి IND VS WI 1st T20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ టి 20 సిరీస్ కూడా గెలుస్తుందేమో చూడాలి