పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam). పూజ హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌. కె. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. జస్టిన్‌ ప్రభాకరన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

గత కొంతకాలంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా రాధేశ్యామ్‌ కొత్త మేకింగ్ వీడియోని ‘రాధేశ్యామ్’ సాగా పేరుతో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. ‘రాధేశ్యామ్‌’ కోసం చిత్రబృందం ఎంత కష్టపడ్డారో కళ్ళకు కట్టినట్లు అర్థమవుతోంది.