విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ F3 .అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Tamannaah, Mehareen హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో Rajendra Prasad, Sunil కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి తీసిన F3కి సీక్వెల్ గా F3 మూవీ తెరకెక్కుతోంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా మారిపోయింది .ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన Acharya మూవీ విడుదలవుతోంది .దాంతో ఈ మూవీతో పోటీ పడకుండా వెనక్కి వెళ్ళింది F3. ఈ మూవీని మే 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అధికారికంగా ఈ రోజు ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా F3 మూవీ నుండి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు .ఈ పోస్టర్ లో Venkatesh,Varun Tej డబ్బులు దగ్గరగా పెట్టుకొని చేతులు కలిపి ఉన్న స్టైల్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ రిలీజ్ డేట్ ను కూడా కన్ఫామ్ చేశారు చిత్రయూనిట్. మే 27 న ప్రపంచవ్యాప్తంగా F3 విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు .అనేక వాయిదాలు పడుతూ వస్తున్న F3 మూవీ మే 27న అయినా రిలీజ్ అవుతుందా లేదా మళ్ళీ వాయిదా పడుతుందా అన్నది ఆసక్తిగా మారింది.