మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .Ram Charan కెరీర్లో ఇది 15వ మూవీ కాగా Dil Raju బ్యానర్లో ఇది 50వ మూవీ. అందుకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై టెక్నికల్ వేల్యూస్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఒక న్యూస్ నెట్ లో వైరల్ అవుతుంది .ఈ మూవీలో Ram Charan రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారని సమాచారం .ఒక లుక్ లో యంగ్ బాయ్ గా కనిపించే Charan మరో లుక్ గడ్డంతో కనిపిస్తాడని తెలుస్తోంది .ఇక ఈ మూవీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి దర్శకుడు Shankar స్క్రీన్ మీద తనదైన స్టైల్లో చూపిస్తాడాని సమాచారం. గతంలో వచ్చిన ఒకే ఒక్కడు స్టైల్లో ఈమూవీ ఉండబోతుందట .ఇక Ram charan కి జోడీగా kiara Advani నటిస్తోంది .వీరిద్దరూ కలిసి ఇదివరకే ఒక సినిమాలో నటించారు .RC15 సినిమాలో sunil మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి S Thaman సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ RC15 కంప్లీట్ చేసుకుంది. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు .ఇటీవల కాలంలో సరైన హిట్ లేని శంకర్ Rc15 తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.