సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ (Sharukh Khan) కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్‌’(Pathaan). దీపికా పదుకోన్‌ (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్‌ అబ్రహాం ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ సినిమా సెట్స్ నుంచి త‌న ఫోటోను ఇన్‌స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఇందులో 8 ప్యాక్ బాడీతో షారుఖ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు.

షారుక్‌ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. జీరో సినిమా తర్వాత షారుక్‌ ఖాన్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. కాగా, యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 25 జ‌న‌వ‌రి 2023న విడుదల కానుంది.