Khiladi OTT Release Date: రవితేజ ‘ఖిలాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్.!

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja)కథానాయకుడిగా దర్శకుడు రమేశ్ వర్మ(Ramesh Varma) రూపొందించిన చిత్రం ‘ఖిలాడి'(Khiladi). ఇందులో రవితేజకు జోడీగా, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించారు. భారీ బడ్జెట్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్DSP సంగీతాన్ని అందించాడు. అయితే ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సఫీసు వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే తాజాగా ఖిలాడి సినిమా ఓటీటీలో(Khiladi On OTT) వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో(Disney Plus Hotstar)మార్చి రెండో వారంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. ‘ అభిమానులరా సిద్ధంగా ఉండండి.. మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్‌ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ స్ట్రీమింగ్ కానుంది’ అని ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది.