వలీమై (Valimai )సినిమాతో ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు హీరో అజిత్(Ajith ). ఆయన నటించిన ప్రతి సినిమా ఎదో ఒక గట్టి కాన్సెప్ట్ తో చేస్తాడు.అందుకే మాస్ ప్రేక్షకులకు అజిత్(Ajith ) సినిమా అంటే ఇష్టం.టీజర్,ట్రైలర్ తో అంచనాలు పెంచిన వళీమై (Valimai )సినిమా తెలుగులో కూడా హైప్ క్రీయేట్ చేసింది.ఇక నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో నిర్వహించారు.భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.

ఇక తెలుగులో కూడా 2కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక వలీమై రీలిజ్ అయిన ఒక్క రోజు తరవాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) నటించిన భీమ్లానాయక్ (bheemla Nayak )విడుదల కాబోతోంది. వలీమై సినిమా సక్సెస్ కావలంటే బాక్సాఫీస్ వద్ద 2 కోట్లకు పైనే షేర్స్ కలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వలీమై ఎంతటి హిట్ సాధిస్తుందోమో చూడాలి.