టీమిండియాలో(Team India ) ఇక ప్రయోగాలు లేవని రోహిత్ (Rohit Sharma )తెలిపారు. శ్రీలంకతో(Sreelanka ) టి20,టెస్ట్ సిరీస్ లను భారత్ ఆడనుంది(Ind vs Sl T20 ). ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుండి శ్రీలంక తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇక ప్రయోగాలు ఉండవని తెలియజేశారు రోహిత్ శర్మ(Rohit Sharma ).ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్(Ishan kishan ) ,ఋతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లు పంపించి ప్రయోగాలు చేశారు. కానీ వరల్డ్ కప్ దగ్గరలో ఉన్న సమయంలో ప్రయోగాల కంటే టీమ్ విజయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.

ఇకపై ఓపెనర్ గా నేనే వస్తానని రోహిత్ శర్మ(Rohit Sharma ) తెలిపారు. లక్నో వేదికగా గురువారం నుండి మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది.ఇటీవల వెస్టిండీస్ ని వైట్ వాష్ చేసి టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన భారత్, శ్రీలంక (Ind vs sl )మీద కూడా అదే విజయాలను కొనసాగించాలని భావిస్తోంది.