మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న బిగ్ మూవీ Acharya . ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . Chiranjeevi,Ram charan కలిసి ఆచార్యలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడి ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది. దాంతో ఈ చిత్ర ప్రమోషన్ ని మొదలు పెట్టాలని చూస్తున్నారు .ఈ క్రమంలో ఆచార్య ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఇప్పటికే ఆచార్య చిత్రం నుండి వచ్చిన టీజర్ ,పోస్టర్స్ ,పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన పనులను దర్శకుడు కొరటాల శివ మొదలుపెట్టినట్లు సమాచారం .ఈ మూవీలో Ram Charan , Chiranjeevi ఇద్దరు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు .ఇక చిరుకి జోడీగా కాజల్ ,చరణ్ కి జోడీగా పూజ నటిస్తున్నారు. పోస్టర్స్ ,టీజర్స్ తో అంచనాలు పెంచిన Acharya Trailer రిలీజ్ అయ్యాక ఇలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి మరి.
Recent Comment