కన్నడ రాక్ స్టార్ యశ్ (Yash ) హీరోగా KGF 2 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మూవీ నుండి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షోలే సినిమాలోని మెహబూబా మెహబూబా సాంగ్ ని రీమెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ లో కియార అద్వానీ(Kaira Advani ) స్టెప్పులు వేసిందని సమాచారం . సీనియర్ హీరోయిన్ నదియా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
KGF 1 తో సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగాడు యష్(Yash ). ఇక అంతకుమించి అన్నట్టు KGF 2 ఉండబోతోందని,ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను సంజయ్ దత్(Sanjay dutt ) పోషిస్తున్నాడు.రవీనా తాండన్ కూడా ముఖ్య పాత్రలలో కనిపించనుంది. భారీ అంచనాలతో వస్తున్న KGF2 ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
Recent Comment