RRR Big Update: `ఆర్ఆర్ఆర్` విడుదలకు ముందే ఊహించని ఎదురుదెబ్బ!
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్ఆర్ఆర్) దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.
మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పుడు నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాతో పోరాట వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన చరిత్రలను వక్రీకరిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాట యోధులను రాజమౌళి డబ్బుల కోసం వాడుకుంటున్నారని. ముందు ఈ సినిమాను కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులకు చూపించాలని లేకపోతే హైదరాబాద్, ఢిల్లీలోని సెంట్రల్ సెన్సార్ బోర్డు ముందు ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Recent Comment