Nagarjuna-Akhil Multistarrer Movie: సూపర్ హిట్ రీమేక్‌లో నాగ్.. అఖిల్‌తో మరోసారి స్క్రీన్ పై…
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగ్ నటించిన ‘బ్రహ్మస్త్ర’ రిలీజ్ కు రెడీగా ఉండగా.. ‘ది ఘోస్ట్’ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమా తరువాత నాగార్జున తన 100వ చిత్రాన్ని మొహన్‌రాజా(Mohana Raja) దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
నాగార్జున-మొహన్‌రాజా కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి చేసిన ‘బ్రో డాడీ’(Bro Daddy) చిత్రానికి రీమేక్ అని సమాచారం. అలాగే అంతకుముందు ‘మనం’, ‘బంగార్రాజు’ సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ సినిమాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్య(Naga Chaitanya)తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసిన నాగార్జున. ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్(Akhil Akkineni)తో కూడా ఇందులో స్క్రీన్ షేర్ చేసుకొనున్నారనే టాక్ వినిపిస్తోంది.
Recent Comment