తెలుగుదేశం (TDP ) పార్టీ యువనేత నారా లోకేష్(Nara Lokesh ) విపక్ష నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. YSRCP నాయకులను ఉరి తీయాలని మండి పడ్డారు.తెలుగుదేశం (Tdp )పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు(Ayanna Patrudu ) నిజాలు చెప్పినంత మాత్రాన ఆయనపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ(YSRCP ) నాయకులు చేసే పనులకు ,మాట్లాడే బూతులకి, చెప్పే మాటలకి ఉరి తీయాలని తెలిపారు.
మంచి, మర్యాదలు మరచి వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న పోలీసులు ఏమి పట్టనట్టు ఉంటున్నారని తీవ్ర కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీద పగ సాధించడమే జగన్ (Jagan )రాజన్న రాజ్యం అని మండి పడ్డారు. జగన్ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. లోకేష్ (Nara Lokesh )చేసిన వ్యాఖ్యలు ap లో దుమారం రేపుతున్నాయి.
Recent Comment