న్యూజిలాండ్‌ (New zealand ) జట్టు ఎట్టకేలకు దక్షిణాఫ్రికా (SA)మీద సూపర్ విక్టరీ కొట్టింది. 18 సంవత్సరాల తరువాత స దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్‌ లో గెలిచింది.ఈ టెస్ట్ మూడు రోజుల్లోనే కంప్లీట్ కావడం విశేషం.మొదటి టెస్ట్ లో న్యూజిలాండ్‌ ( New Zealand )ఇన్నింగ్స్‌ 276 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 95 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. కానీ న్యూజిలాండ్ మాత్రం అదరగొట్టింది.

మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ (New Zealand)482 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా దక్షిణాఫ్రికా(SA) కేవలం 111 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. న్యూజిలాండ్ సీనియర్‌ బౌలర్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసిన మ్యాట్‌ హెన్రీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.18 ఏళ్ల తరువాత దక్షిణాఫ్రికా టెస్ట్ విజయం పొందడంతో న్యూజిలాండ్ జట్టు సంబరాలు చేసుకుంటోంది.