పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’. అర్జున్‌ రెడ్డితో భారీ హిట్‌ కొట్టిన సందీప్‌ రెడ్డితో ప్రభాస్‌ సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెంచేలా ఉంది. 

అదేంటంటే ‘స్పిరిట్‌’ మూవీలో రెబల్ స్టార్ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫిసర్‌గా కనిపించబోతున్నాడట. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అలాగే “ఆదిపురుష్” కి కూడా నిర్మాత అయినటువంటి భూషణ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపారు.

కాగా, ఈ సినిమా భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.