టాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు భీంలా నాయక్ ( Bheemla nayak ) మీద పడింది. పవన్ కళ్యాణ్(Pawan kalyan ) ఊర మాస్ క్యారెక్టర్ లో భీంలా నాయక్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫిబ్రవరి 25 న గ్రాండ్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ విడుదల అవుతోంది. రాణా(Rana), పవన్(Pawan) పోటీ పడి మరీ ఈ చిత్రంలో నటించారు. ఇక ఈ మూవీ 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని చెప్పాలి. హిట్ టాక్ వస్తే దాదాపు200 కోట్లకు పైగా భీంలా నాయక్ (Bheemla nayak)కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.ఇక ap లో 100 శాతం థియేటర్స్ అనుమతి ఇవ్వడం మూవీకి కలిసి వచ్చే అంశం.వకీల్ సాబ్ తో మంచి హిట్ కొట్టిన పవర్ స్టార్(Pawan kalyan) భీంలా నాయక్ తో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇక పవన్ కి జోడిగా నిత్యా మీనన్(Nitya meenon) నటిస్తోంది. తమన్ అందించిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.మరి 25న రిలీజ్ అవుతున్న భీంలా నాయక్ ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొడతాడో చూడాలి