దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇటీవల చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించిన చిత్రబృందం.. బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకి మలయాళ నటుడు టొవినో థామస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.  చరణ్ లాంటి మంచి మిత్రున్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా వల్ల నేనూ రామ్ చరణ్ ఫ్రెండ్స్ కాలేదు. అంతకు ముందే మేం మంచి స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయవంతంగా పూర్తయింది. చరణ్ వంటి గొప్ప ఫ్రెండ్ ను అందించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. మా ఇద్దరి బంధం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ముగిసిపోదు. మేమెప్పుడూ ఇలానే అన్నదమ్ముల్లా ఉంటాం అని ఎన్టీఆర్ అన్నారు. కాగా, డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా 2022 జనవరి 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను అన్ని భాషల్లోనూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.