న్యూ జిలాండ్ లో ప్రారంభమైన మహిళల వన్ డే ప్రపంచ కప్ లో భాగం గా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో భారత జట్టు పాక్ పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ ల లో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఓపెనర్ స్మ్రితి మందాన 52 పరుగులు, దీప్తి శర్మ 40 పరుగులు చేసి రాణించారు. మరో ఓపెనర్, హిట్టర్ షెఫాలీ వర్మ డక్ అవుట్ అయ్యారు.
కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత పేలవం గా ఆడి 36 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం వచ్చిన హర్మాన్, రిచా లు స్వల్ప స్కోర్ ల కే అవుట్ అవడంతో, భారత్ 114 పరుగులకే 6 వికెట్ల్య్ కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది.
అయితే అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన స్నేహ రానా, పూజ వస్త్రకర్ అద్భుతం గా ఆడడమే కాకుండా ఏదో వికెట్ కు 122 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నేలెకొల్పారు.
పూజ వస్త్రకర్ 67 పరుగులు చేయగా, స్నేహ రానా 53 పరుగులు చేసి అజేయం గా నిలిచింది.
అనంతరం 245 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 132 పరుగుల కే కుప్పకూలింది.
భారత జట్టు బౌలర్ల లో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసింది. స్నేహ రానా, జులన్ గోస్వామి చెరో రెండు వికెట్లు తీయగా, మేగ్నా సింగ్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ తీశారు.
పాక్ పై భారత జట్టు అప్రతిహత విజయాల రికార్డు ను ఈ విజయం తో పదిలపరుచుకుంది.
పూజ వస్త్రకర్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
భారత జట్టు తన తదుపరి మ్యాచ్, న్యూజిలాండ్ తో ఈ నెల 10 న తలపడనుంది.
Recent Comment