గత మూడు రోజులుగా కరోనా మళ్ళి తన ప్రతాపాన్ని చూపిస్తోంది.  గత రెండు రోజులుగా, రోజుకు ౩౦ వేల కేసులు నమోదవుతుంటుంటే,  నిన్న ఒక్కరోజే  58 వేల మంది కి పైగా కరోనా సోకింది.  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు ఇప్పటి దాకా 2000 కు పైగా నమోదయ్యాయి.  అత్యధికం గా మహారాష్ట్రలో, ఢిల్లీ లో ఈ వేరియంట్ ని గుర్తించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఈ కొత్త వేరియంట్ 24 రాష్ట్రాలకు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విషరించింది.

ఇప్పటి కే చాలా కంపెనీలు వర్క్ ఫ్రొం హోమ్ ఆదేశాలు జారీ చేశాయి.  పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నాయి.  కొన్ని రాష్ట్రాలలో థియేటర్ లు మూసి వేస్తే, మరి కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్క్యుపెన్సీ తో నడిపిస్తున్నారు.

ఈ సారి కరోనా చిన్న పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినా, నమోదవుతున్న కేసుల్లో, ఓమిక్రాన్ కన్నా డెల్టా కేసులే అధికం గా ఉన్నాయ్.  కాబట్టి, ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యం గా పిల్లల విషయం లో.

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా వర్క్ ఫ్రొం హోమ్ సబంధించిన విషయం పైన ట్విట్టర్ వేదికగా ఒక వీడియో చేశారు.  అమితాబ్, షారుక్ నటించిన సినిమా లో నుంచి ఒక వీడియోను ఈ వర్క్ ఫ్రొం హోమ్ పరిస్థితులకు అన్వయిస్తూ చేశారు