భారీ బడ్జెట్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu arjun ) కెరియర్ లో తొలిసారి పాన్ ఇండియా లెవల్లో పుష్ప(Pushpa ) సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ సుకుమార్(Sukumar ). ఈసినిమా ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాదించింది. సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోను 100కోట్లు సాధించింది. ఇక పుష్పకి సీక్వెల్ గా రానున్న పుష్ప ది రూల్(Pushpa The Rule ) స్టోరీని మార్చేస్తున్నాడట సుకుమార్(Sukumar ). ఈ సినిమా కూడ పాన్ ఇండియాగా రానున్న నేపథ్యంలో చాలా మార్పులు చేసి పుష్ప పార్ట్ వన్ కంటే ఎక్కువ ఇంట్రస్ట్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.

ఈనేపథ్యంలో పుష్ప సినిమాలో అల్లుఅర్జున్(Allu Arjun) కి ఫ్రెండ్ గా ఉన్న కేశవ(Kesava ) సెకండ్ పార్ట్ లో విలన్ గా మారనున్నాడట. ఇక దాక్షయినిగా నటించిన అనసూయ(Anasuya ) హీరోయిన్ శ్రీవళ్లిని చంపేస్తుందట.ఇలాంటి ట్విస్ట్ లతో త్వరలోనే పుష్ప ది రూల్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెల్లబోతున్నాడు దర్శకుడు సుకుమార్( Sukumar ).