భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కలకత్తా వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్స్ లో 157 పరుగులు చేసింది.నికోలస్ పూరన్ ,కీరన్ పొలార్డ్ విజృంభించడంతో వెస్టిండీస్ జట్టు 157 పరుగులు చేయగలిగింది.ఇక 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్స్ లో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. రోహిత్40 ,ఇషాన్ కిషన్ 35, కోహ్లీ 17,రిషబ్ పంత్ 8 ,సూర్య కుమార్ 34 పరుగులు చేసి టీమిండియాకి విజయాన్ని అందించారు.