భారతీయులు ఉపయోగిస్తున్న మొబైల్ యాప్స్ లో చాలావరకు చైనా ఆప్స్ ఎక్కువగా ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో చైనా యాప్స్ ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. 2020లో దాదాపు రెండు వందల ఇరవై నాలుగు చైనా యాప్స్ ని కేంద్రం బ్యాన్ చేసింది.ఇప్పుడు తాజాగా మళ్లీ చైనా యాప్స్ మీద భారత ప్రభుత్వం కొరడా విసిరింది .తాజాగా మరో 54 చైనా యాప్స్ ని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా నిషేధించిన యాప్స్ లలో బ్యూటీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, యాప్ లాక్ ,డ్యూయల్ స్పేస్ లైట్ ,బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా తోపాటు మొత్తంగా 54యాప్స్ నిషేధించారు .ఇండియన్స్ కు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్నీ ఈ యాప్స్ ద్వారా చైనాకు చేరవేస్తున్నారు అంటూ, అందుకే వీటిని నిషేధిస్తూ ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇకమీదట ఈ యాప్స్ భారత్ ఉపయోగించి ప్లే స్టోర్ లో కూడా దొరకవని తెలిపారు.