సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చి కొన్ని రోజులుగా కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు దుబాయ్‌ టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే స్టార్ డమ్ కలిగిన మహేష్ బాబుకి అటు ఆఫ్ లైన్ లో ఎలా అయితే మంచి క్రేజ్ ఉందో అలానే ఆన్ లైన్ లో కూడా అంతకు మించి క్రేజ్ ఉంది. అయితే మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఏ భారత్ హీరోకి కూడా దక్కని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక్క పోస్ట్ కి లక్ష కి పైగా లైక్స్ ఉన్న పోస్టులు 30కి పైగా ఉన్న ఏకైక హీరోగా సూపర్ స్టార్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా చేసిన తొలి ట్వీట్ కి లక్ష లైక్స్ ని అందుకోవడం మరో విశేషం. ఇక సినిమాల విషయనికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలోనే ఉన్నాడు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. తన సర్కారు వారి పాట చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.