టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిది ఒక సెపరేట్ స్టయిల్ అని చెప్పాలి. ఏది ఉన్నా అది మొహం మీద బయటకు చెప్పడం ఆయన స్టయిల్. ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న మోహన్ బాబు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న అనుభవం మోహన్ బాబు గారికి ఉంది. అప్పట్లో రాజకీయాల్లో కూడా చాలా ఆసక్తిగా ఉండేవారు మోహన్ బాబు. ఒకప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చిన మోహన్ బాబు ,గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన మద్దతు తెలిపి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో ఉండబోనని మోహన్ బాబు తెలియజేశారు.ఆయన మూవీలతో ,యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నారు. ఇకపై తాను ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనని ,రాజకీయాలకు శాశ్వతంగా సెలవు ప్రకటిస్తున్నానని మోహన్ బాబుజ్ తెలియజేశారు. ఇక మోహన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా ,ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజకీయాలపై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు మోహన్ బాబు.