ఆస్ట్రేలియా క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా ,స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు మాక్స్ వెల్. అలాగే ఐపీఎల్ లో కూడా భారీ స్కోరు నమోదు చేస్తూ ఇండియన్ ఫ్యాన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ క్రికెటర్ ఒక ఇండియన్ సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. భారత సంతతికి చెందిన విని రామన్ తో మార్చి 27న పెళ్లికి సిద్ధమయ్యాడు. 2020 లోనే వీరికి నిశ్చితార్థం జరిగింది. గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లి పీటలేకపోతున్నారు. భారతీయ సంప్రదాయంతో మెల్బోర్న్ వేదికగా వీరి వివాహం జరగనుంది.విని రామన్ తల్లి తండ్రులు ఆస్ట్రేలియలో సెటిల్ అవ్వగా ఆమె కూడా అక్కడే పుట్టి పెరిగింది. ఆమె పార్మాసిస్ట్ గా పని చేస్తోంది.ఇక మాక్స్ వెల్ ని ఈసారి కూడా ipl లో rcb టీమ్ కొనుగోలు చేసింది.మార్చ్ చివరి వారం నుండి ipl మ్యాచెస్ మొదలు కాబోతున్నాయి.ఇక పెళ్లి ఉన్న నేపథ్యంలో మాక్స్ వెల్ మొదట్లో జరిగే కొన్ని మ్యాచ్ ల్లో అందుబాటులో ఉండడని సమాచారం.