రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక వైపు స్పెషల్‌ ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతూ మరోవైపు కొత్త పోస్టర్లు, సాంగ్స్ తో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రపై సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి డిజైన్ చేసిన ఒక ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. దీనికి అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది.

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషించిన పాత్ర అల్లూరి సీతారామరాజు పై సాంగ్ ని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ పాటను ఎన్టీఆర్ కోసం రిలీజ్ చేసిన సాంగ్ కంటే భారీగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ పాటలో చరణ్ పై చూపించే విజువల్స్ ఈ సినిమా కోసం చరణ్ మెకోవర్ కట్స్ ఈ సాంగ్ లో డిజైన్ చేశారట. కాగా,  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.