RRR Big Update: `ఆర్ఆర్ఆర్` నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. ఎగిరిగంతేస్తున్న ఫ్యాన్స్
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్‌ఆర్‌ఆర్) దర్శకదీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.
ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు, మేకింగ్ వీడియోలు అశేష ఆధరణ పొందుతున్నాయి. అయితే మహా శివ రాత్రి సందర్భంగా సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఈ పోస్టర్‌ను ఇప్పుడు ఎన్టీఆర్ ,రామ్‌చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. లైకులు, రీట్వీట్స్ అంటూ హంగామా చేస్తున్నారు. కాగా, ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
Recent Comment