Pawan Kalyan Remuneration: హాట్ టాపిక్‌గా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ప్రస్తుతం భీమ్లా నాయక్(BHEEMLA NAYAK) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు క్రిష్(KRISH) డైరెక్షన్ చేస్తోన్న హరి హర వీరమల్లు(HARI HARA VIRAMALLU) సెట్స్‌పై సిద్ధంగా ఉంది. అలాగే హరీష్ శంకర్ (HARISH SHANKAR) దర్శకత్వంలో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్(BAVADIYUDU BAGATHSINGH) కూడా లైన్లో రెడీగా ఉంది. అయితే.. ఇప్పుడు పవన్ మరో సినిమా చేయబోతున్నారని, అది కూడా రీమేక్ సినిమా అనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన మూవీ ‘వినోదయ సీతమ్’. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని చూస్తున్నారు.
ఇందులో పవన్‌కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి పవన్‌కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం పపన్‌కళ్యాణ్ కేవలం 20రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారట. అలాగే ఈ 20రోజులకు గాను పవన్ కళ్యాణ్ రూ. 50కోట్ల వరకు రెమ్యునరేషన్(Pawan Kalyan Remuneration) తీసుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎంత పారితోషికం అయినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Recent Comment