లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్ కే ఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. ఆ తరవాత బ్యాట్స్ మన్ ల లో డికాక్ 24 పరుగులు, మనీష్ పాండే 38 పరుగులు చేశారు. స్టఇనిస్ 10 పరుగులు, దీపక్ హుడా 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు
ముంబై ఇండియన్స్ బౌలర్ల లో ఉనద్కట్ రెండు వికెట్లు తీయగా, మురుగన్ అశ్విన్, అలెన్ తలా ఒక వికెట్ తీశారు.
200 పరుగుల భారి లక్ష్య ఛేదన లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల కే 3 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాలలో పడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 13 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దేవాల్డ్ బ్రెవిస్ దాటి గా ఆడి 13 బంతుల్లో 31 పరుగులు చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
సూర్య కుమార్ యాదవ్ 37 పరుగులతో, తిలక్ వర్మ 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పోలార్డ్ ధాటి గా ఆడి 14 బంతుల్లో 25 పరుగులు చేసినా చివర వరకు నిలబడలేక పోయాడు. ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారీ స్కోరు ఛేదనలో టాప్ ఆర్డర్ విఫలమైందని చెప్పాలి
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ల లో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, హోల్డర్, చమీర, బిష్ణోయ్, స్టఇనిస్ తలా ఒక వికెట్ తీశారు
Recent Comment