ప్రపంచ క్రికెట్( Cricket ) లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar )స్థాయిలో బ్యాటింగ్ లో రికార్డులు సృష్టించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli ). క్రికెట్ లోని అన్నీ ఫార్మాట్స్ లో రన్ మెషిన్ గా పేరు తెచ్చుకొని పరుగుల వరద పారించాడు .ఇక సచిన్ (Sachin )నెలకొల్పిన రికార్డులను సైతం కోహ్లీ బద్ధలు కొడతాడానే అనే భావన కూడా కలుగ చేసాడు.ఇలాంటి క్రికెటర్ కి కూడా ఒక దశలో పామ్ కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు .అలాంటి సందర్భంలో కోహ్లీ (Kohli )తన సహాయం కోరాడాని ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు .2014 సంవత్సరంలో కోహ్లీ పామ్ కోల్పోయి తన వద్దకు వచ్చాడని బ్యాటింగ్ లో మెలుకువలు కోసం కొంచెం సమయం కేటాయించాలని తనను కోరాడని సచిన్ తెలియజేశాడు.
ఈ క్రమంలో కోహ్లీకి ఫామ్ లో లేనప్పుడు ఎలా ఆడాలి, బ్యాటింగ్ ని ఎలా మెరుగు దిద్దుకోవాలి అని తనకు తెలిసిన సలహాలు ఇచ్చారని సచిన్ తెలియజేశాడు .ఇక సచిన్ సలహాలతో కోహ్లీ(Kohli ) మరింతగా బ్యాటింగ్ మెరుగుపడి భారీ స్కోరు సాధించి టీమిండియా విజయాలను కీలక పాత్రను పోషించాడు. కోహ్లీ గురించి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin )ఇప్పుడు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.
Recent Comment