KGF చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యష్ (Yash )హీరోగా వచ్చిన kgf ఇండియా వైడ్ గా దిమ్మురేపింది.ఇపుడు kgf 2 వస్తున్న సంగతి తెలిసిందే. KGF 2 సినిమా షూటింగ్ చివరి దశ పనులు జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్(Prashanth neel ) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక KGF 2 సినిమాకి సంబందించి ఒక పాట అనుకున్న రీతిలో కుదరకపోవటంలో మళ్ళీ ఆ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది .అయితే దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ ఎట్టి పరిస్థితిలో KGF 2 సినిమాని ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గోల్డ్ మైనింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి రికార్డ్ బద్ధలు కొడుతుందో చూడాలి.
Recent Comment