యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘కార్తికేయ’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్,గుజరాత్, ఉత్తరాఖండ్
లలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం తరువాతి షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.