నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna ) అఖండ(Akhanda ) సక్సెస్ తో జోరు మీద ఉన్నాడు. అదే ఊపుతో మరో సినిమా మొదలు పెట్టేశాడు. NBK 107అని పిలువబడే ఈ సినిమా లో శృతిహాసన్ (Shruthi hasan ) హీరోయిన్ గా కనిపిస్తోంది.ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna )డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. పోలీస్ ఆఫిసర్ గా ఒక పాత్రలో కనిపించనున్నాడు. మరోకటి 60 ఏళ్ల వృద్ధునిగా, ఊరికి పెద్దాయనగా కనిపించబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే తెలంగాణలోని(Telangana ) సిరిసిల్లలో రేగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తదుపరి షూటింగ్ కర్నూలు ప్రాంతంలోని ఓ గుడిలో పాటు షూటింగ్ ఉంటుంది. క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపిచంద్ మలినేని(Gopichnd Malineni ) ఈ సినిమాని డైరెక్ట చేస్తున్నాడు. బాలకృష్ణ (Balakrishna NBK107) మూవీ అఖండ కంటే పెద్ద హిట్ అవుతుందని సినిమా యూనిట్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.