Bhagyashree on Prabhas: ‘ప్రభాస్ అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు’: నటి భాగ్యశ్రీ
ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రబస్ తల్లి పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ(Bhagyashree).
అయితే ప్రభాస్ తో కలిసి నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ.. రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్‌కు అమ్మగా నటించడం ఆనందంగా ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా నటుడైన కూడా సెట్ లో అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తాడు. రాధేశ్యామ్ తొలి రోజు షూటింగ్ లో ప్రభాస్‌ని ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా అతనే నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఆ సమయంలో అతను నా అభిమాని అంటూ చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యాను అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.
Recent Comment